రెండేళ్ల తరువాత కీలక బాధ్యతల్లోకి ఐఏఎస్ శ్రీలక్ష్మీ, అక్కడే అసలు ట్విస్ట్..!!

ఐఏఎస్ శ్రీలక్ష్మీ రెండేళ్ల తరువాత తిరిగి విధుల్లో చేరారు. కీలక బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నుంచి శ్రీలక్ష్మికి పోస్టింగ్ దక్కలేదు. గత వారం శ్రీలక్ష్మికి ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. ఈ రోజు శ్రీలక్ష్మీ సాధారణ పరిపాలన శాఖలోని జీపీఎం అండ్‌ ఏఆర్‌ విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. ఈ పోస్టులో శ్రీలక్ష్మీ రేపు (మంగళవారం) వరకు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది.

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వై.శ్రీలక్ష్మీ రెండేళ్ల గ్యాప్ తరువాత తిరిగి విధుల్లో చేరారు. జగన్ సీఎం గా ఉన్న సమయంలో తెలంగాణ నుంచి ఏపీ కేడర్ కు వచ్చిన శ్రీలక్ష్మీకి జగన్ కీలక బాధ్యతలు అప్ప గించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత శ్రీలక్ష్మికి పోస్టింగ్ దక్కలేదు. గత వారం శ్రీలక్ష్మికి ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్‌ ఇచ్చింది. సాధారణ పరిపాలన శాఖలోని జీపీఎం అండ్‌ ఏఆర్‌ విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమించింది. ఈ మేరకు ఈ రోజు (సోమవారం) శ్రీలక్ష్మీ బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ నెల 30న ఆమె రిటైర్‌ కానున్నారు. దీంతో.. ఈ రోజు, రేపు మాత్రమే కొత్త బాధ్యతల్లో శ్రీలక్ష్మీ కొనసాగనున్నారు. 1988 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎలాంటి బాధ్యతలు లేకుండా వెయిటింగ్‌ లో ఉంచారు. కాగా, పదవీ విరమణకు ఒక్క రోజు ముందు బాధ్యతల్లో చేరారు.

తల్లికి వందనం నిధుల జమ ఆ రోజునే, ప్రభుత్వ తాజా నిర్ణయం..!!
తల్లికి వందనం నిధుల జమ ఆ రోజునే, ప్రభుత్వ తాజా నిర్ణయం..!!
ias-srilakshmi-took-charge-as-gad-gpm-ar-special-chief-secretary-retirement-on-30th-of-this-month

రేపు శ్రీలక్ష్మీ పదవీ విరమణ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కెరీర్ ప్రారంభించిన శ్రీలక్ష్మి.. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ కేసులో ఆమె తీవ్ర చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నాటి మైనింగ్ శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా జీవోలు ఇచ్చారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆమెను అరెస్ట్ చేసింది. ఈ కేసుల వల్ల ఆమె ఐఏఎస్ సర్వీసు నుండి సస్పెండ్ అవ్వడమే కాకుండా, జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కాగా.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. అయితే, ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక.. ఏపీకి వచ్చేందుకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. క్యాట్ ఆదేశాల ద్వారా తెలంగాణ నుండి ఏపీ కేడర్‌లోకి బదిలీ చేయించుకున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+