బ్యాంకుల రూపురేఖలు చేంజ్: నిర్మలా సీతారామన్ బిగ్ అనౌన్స్‌మెంట్!

దేశాన్ని 2047 నాటికి 'వికసిత్ భారత్'గా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం త్వరలోనే ఒక ఉన్నత స్థాయి 'హైపవర్ కమిటీ'ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో సోమవారం ప్రారంభమైన పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ సదస్సు 2026 లో మాట్లాడిన ఆమె, బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తగిన సలహాలు, సూచనలు అందించాలని బ్యాంకింగ్ దిగ్గజాలను, అధికారులను కోరారు.

గత కొన్నేళ్లుగా చేపట్టిన పక్కా సంస్కరణల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు తీవ్రమైన నష్టాల నుంచి బయటపడి ప్రస్తుతం అత్యంత లాభదాయకంగా మారాయని ఆర్థిక మంత్రి ప్రశంసించారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు దేశ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయని, ఇది బ్యాంకింగ్ రంగానికి బలమైన పునాదిని ఇచ్చిందని చెప్పారు. "మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. 2047 నాటికి మన ముందు 20 ఏళ్ల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో వికసిత్ భారత్ లక్ష్య సాధనకు తగ్గట్లుగా బ్యాంకులను సిద్ధం చేయడానికి ఇదే సరైన సమయం" అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

Banking Sector Reforms for Viksit Bharat 2047 FM Nirmala Sitharaman Urges Bankers to Submit Ideas

ఏడు కీలక రంగాలపై ప్రత్యేక రీసెర్చ్!

ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ ఈ రెండు రోజుల సదస్సు కోసం బ్యాంకింగ్ రంగానికి ఉపయోగపడే ఏడు ప్రత్యేక అంశాలపై లోతైన పరిశోధనా పత్రాలను సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు.

  • యూత్ బ్యాంకింగ్ (యువత అవసరాలకు తగిన సేవలు)
  • ఇన్వెస్ట్‌మెంట్ సైకిల్‌కు సహకారం
  • గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ)
  • వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తుల మౌలిక వసతులు
  • ప్రాధాన్యతా రంగా రుణాలు (ప్రయారిటీ సెక్టార్ లెండింగ్)
  • క్రెడిట్ కార్డ్ బిజినెస్ పునర్నిర్మాణం

యువశక్తికి పెద్దపీట.. బ్యాంకుల సరికొత్త వ్యూహం!

దేశంలో దాదాపు 29 శాతం జనాభా 15 నుంచి 29 ఏళ్ల వయస్సు గల యువత కావడం మన దేశానికున్న అతిపెద్ద బలం అని మంత్రి గుర్తుచేశారు. బ్యాంకులు తమ భవిష్యత్ వ్యూహాలను రూపొందించేటప్పుడు ఈ యువ జనాభాను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ఈ రెండు రోజుల సదస్సు ముగిసిన తర్వాత వెలువడే సిఫార్సులు, తుది నివేదికలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే హైపవర్ కమిటీ ముందు ఉంచుతామని, ఆ కమిటీ ఇచ్చే సూచనలతో బ్యాంకింగ్ సంస్కరణల తదుపరి దశ ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+