ధనుస్సు రాశి, మకర రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. దీన్ని ప్రభావితమయ్యే రాశులవారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. అలాగే సెప్టెంబరు నెలకు సంబంధించి ధనుస్సు రాశి, మకర రాశికి సంబంధించినవారి జాతక ఫలం ఎలా ఉందో తెలుసుకుందాం.

తులారాశి, వృశ్చిక రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం
తులారాశి, వృశ్చిక రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం

ధనుస్సు రాశి (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం)

ధనుస్సు రాశి వారికి సెప్టెంబరు నెల సానుకూలమైన మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌తో క్లిష్టమైన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సొంత వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. నెలాఖరులో ఊహించని వ్యాపార అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలసి దైవ దర్శనాలు చేసుకుంటారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. గురువారాల్లో దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడం మంచిది.

సింహరాశి, కన్యా రాశి సెప్టెంబరు నెల జాతకఫలం
సింహరాశి, కన్యా రాశి సెప్టెంబరు నెల జాతకఫలం
Horoscope Predictions and Results for these two zodiac signs Sagittarius and Capricorn for September month

మకర రాశి ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు)

మకర రాశి వారికి సెప్టెంబరు నెల సవాళ్లతో కూడిన మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగులకు పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. కార్యాలయంలో కొన్ని మార్పులు రావచ్చు. స్నేహితులు లేదా సహోద్యోగుల సహాయంతో సవాళ్లను అధిగమిస్తారు. ఆర్థిక పరంగా కొద్దిపాటి ఒడిదుడుకులు ఉంటాయి. ఆదాయానికి లోటు లేకపోయినా, ఊహించని ఖర్చులు రావచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. కుటుంబంలో చిన్నపాటి సమస్యల వల్ల మానసిక ఆందోళన కలగవచ్చు. అయితే, కీలకమైన ఆస్తి లేదా స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వృత్తి రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు, ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యం, ఆహార నియమాల పట్ల శ్రద్ధ అవసరం. శనివారాల్లో ఆంజనేయ స్వామి లేదా శనీశ్వరుని ఆరాధన చేయడం ద్వారా ప్రతికూలతలు తొలగిపోతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+