దగ్గరకొస్తే చెంప పగలగొడతా!: యాంకర్ శ్రీముఖి ప్రవర్తనపై భగ్గుమంటున్న నెటిజన్లు!!

తెలుగు బుల్లితెరపై ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 10కు ముందే సందడి మొదలైపోయింది. ఇప్పటికే అగ్నిపరీక్ష లో వివిధ టాస్కులు పెట్టిన అనంతరం ఐదారుగురిని కామనర్స్ కోటాలో ఎంపిక చేసి.. బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నారు. అయితే అగ్నిపరీక్షలో పలువురు సామాన్యులతో పాటు సోషల్‌మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు కూడా పాల్గొన్నారు. వచ్చేనెల ప్రారంభం కానున్న ఈ రియాలిటీ షోకు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Husharu Pittalu Movie Review: బోల్డ్ కంటెంట్‌తో మెప్పించిందా? యూత్‌కి కనెక్ట్ అయిందా?
Husharu Pittalu Movie Review: బోల్డ్ కంటెంట్‌తో మెప్పించిందా? యూత్‌కి కనెక్ట్ అయిందా?

ఇదిలా ఉండగా.. ఎంటర్‌టైన్‌మెంట్ షోలలో తనదైన మార్కుతో మెప్పించే శ్రీముఖిపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్నిపరీక్ష 2 షో ఆడిషన్స్ ఎపిసోడ్ లో ఓ కంటెస్టెంట్ తో ఆమె ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ వివాదానికి ప్రధాన కారణం అగ్నిపరీక్ష 2 ప్రారంభ ఎపిసోడ్‌లో చోటుచేసుకున్న సంఘటనే. ఇప్పటికే సోషల్ మీడియా సెన్సేషన్ ఉప్పలు బాలు ఆడిషన్ వ్యవహారంలో జడ్జీలపై విమర్శలు వస్తుండగా.. శ్రీముఖ కామెంట్స్ వివాదాన్ని మరింత పెంచాయి. అగ్నిపరీక్ష ఆడిషన్ షోలో 'రన్నింగ్ రాజా' అనే కంటెస్టెంట్ శ్రీముఖిని ఇంప్రెస్ చేసేందుకు ఆమెనే ఇమిటేట్ చేస్తూ ఓ యాక్ట్ చేశాడు. అయితే అతడి ప్రదర్శన నచ్చకపోవడంతో శ్రీముఖి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "ముందు నేను పొమ్మంటావా.. నువ్వు వెళ్లిపోతావా?" అని శ్రీముఖి అనడంతో ఆ వేదికపై వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Anchor Sreemukhi Trolled Over Warning a Contestant in Agnipareeksha 2 Show faces heavy backlash on social media

ఆ సమయానికి పరిస్థితిని చక్కదిద్దేందుకు సదరు కంటెస్టెంట్ "మీరు ఉండాలి.. నేను ఉండాలి.. ఈ షో సక్సెస్ అవ్వాలి" అంటూ సముదాయించే ప్రయత్నం చేసినా శ్రీముఖి శాంతించలేదు. "ఇది చూసి నిన్ను సెలెక్ట్ చేయాలా?" అంటూ శ్రీముఖి సెటైర్లు వేశారు. ఆ తర్వాత జడ్జీలు జోక్యం చేసుకుని శ్రీముఖి ఆగ్రహాన్ని తగ్గించి ఆమెను ఇంప్రెస్ చేయమని సూచించడంతో రన్నింగ్ రాజా మళ్లీ శ్రీముఖి దగ్గరకు వెళ్లాడు. కానీ అతడు పదేపదే దగ్గరకు రావడం శ్రీముఖికి అస్సలు నచ్చలేదు.

ఈ సినిమా ఏంటి బాసూ ఇంత బాగుంది..!
ఈ సినిమా ఏంటి బాసూ ఇంత బాగుంది..!

ఆగ్రహంతో రగిలిపోయిన శ్రీముఖి "దగ్గరకు వస్తే చెంప పగలగొడతా" అంటూ బహిరంగంగానే హెచ్చరించారు. ఆ కంటెస్టెంట్ "అక్క.. అక్క.."అని రిక్వెస్ట్ చేస్తూ తను సరదాగానే చేశానని వివరణ ఇస్తున్నప్పటికీ.. శ్రీముఖి సీరియస్ గా స్టేజ్ దిగి బయటకు వెళ్లిపోయారు. శ్రీముఖి వెళ్లిపోవడంతో జడ్జీలు అతడిని ఆడిషన్స్ నుంచి బయటకు పంపించగా.. ఆ కంటెస్టెంట్ స్టేజ్ వెనుక ఏడుస్తూ కనిపించడం అందరినీ కలిచివేసింది. అతు వెళ్లేవరకు శ్రీముఖి తిరిగొచ్చి స్టేజ్ ఎక్కలేదు.

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలు విడిపోయారు. యాంకర్ శ్రీముఖి అసౌకర్యాన్ని వ్యక్తం చేసినా పదేపదే ఆమె దగ్గరకు వెళ్లడం కంటెస్టెంట్ పొరపాటేనని కొందరు ఆమెకు మద్దతు ఇస్తున్నారు. అయితే మెజారిటీ నెటిజన్లు మాత్రం శ్రీముఖి కామెంట్లను తప్పుపడుతున్నారు. 'సరదాగా చేసిన యాక్ట్‌కి అంత పెద్ద మాటలు అనడం సరికాదు', 'సామాన్యులు అంటే అంత చులకనా?"అని ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు కంటెస్టెంట్లతో మరింత ఓపికగా ఉండాలని సూచిస్తున్నారు. మా ఊళ్లో గొర్రెలు కాయడానికి కూడా శ్రీముఖ పనికిరాదంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పల్లెటూరి వాళ్లను షోలకు పిలిచి అవమానించడమే వీళ్ల పని అంటూ మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+