రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని తాండురులో ఓ మహిళ ఓ లాయరును చెప్పుతో కొట్టి సంచలనం సృష్టించింది. తాండూరు కోర్టులో లాయరుగా పని చేస్తున్న గోపాల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ సదరు మహిళ గోపాల్ ను అందరిముందు చెప్పుతో కొట్టింది. ఆ వెంటనే వెళ్లి తనను వేధించాడని, అందుకే కొట్టానని విన్నివించుకుంది.