• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మంత్రివర్గంలో చేరడంపై ఊసు లేదు, ప్రతిపాదన లేదు: చిరంజీవి

By Pratap
|
chiranjeevi
హైదరాబాద్: మంత్రివర్గంలో చేరడంపై తమకు ఎటువంటి ఆహ్వానమూ ప్రతిపాదనా లేదని, దానిపై చర్చ కూడా జరగలేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చెప్పారు. అలాంటిది ఏమైనా జరిగితే తామే చెబుతామని తెలిపారు. కేబినెట్లో చేరికపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయనీ విధంగా స్పందించారు. తాను వ్యక్తిగత పనుల మీదే ఢిల్లీ వెళ్లానని, అక్కడ ఎవరినీ కలవలేదని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన సోమవారం తిరిగి వచ్చారు. మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తాను అమెరికా పర్యటనలో ఉన్నా పార్టీ అంతర్గత వ్యవహారాలు, రాజకీయ పరిణామాలు చూసుకుంటూనే ఉన్నానని చెప్పారు. ఈ నెల చివరి వారంలో వివిధ అంశాలు, వ్యక్తిత్వ వికాసంపై నిపుణులతో పార్టీనేతలు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిత్యావసర వస్తువుల పెరుగుదలపై 14న నియోజకవర్గాల స్థాయిలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

మైక్రో ఫైనాన్స్ సంస్థల వల్ల ఈ మూడు నెలల్లోనే 30.. 40 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, వీటిపై ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఇవి 50 శాతానికి పైగా వడ్డీ వసూలు చేస్తున్నాయని ఆ వేదన వ్యక్తం చేశారు. కేంద్రం, రిజర్వ్ బ్యాంకు వీటిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలో అవకతవకలకు పాల్పడినవారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరారు.

రాంచరణ్‌కు అవార్డు రానంత మాత్రాన తాను బాధపడబోనని, దానికి ప్రాముఖ్యత ఇవ్వబోనని చిరంజీవి అన్నారు. అవార్డు గురించి చర్చించడం సబబు కాదని, దాన్ని జ్యూరీ విచక్షణకే వదిలేద్దామన్నారు. ఎంత కలెక్షన్ వసూలు చేశాం.. ఎన్ని రికార్డులు బ్రేక్ చేశామనేదే ముఖ్యమని చెప్పారు. అందనంత ఎత్తుకు చరణ్ రికార్డు చేరిందని, అంతకు మించిన రివార్డు ఏముందని ప్రశ్నించారు. తన అభిమానులకు తానంటే ప్రాణమన్నారు. వారి వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా వారుండాలనుకుంటానని, పొలిటికల్‌గా వారిని నియంత్రించబోనని చిరు స్పష్టం చేశారు. 'గద్దర్‌ను నా అభిమానులు కలవడంతో పార్టీకి సంబంధం లేదు. వ్యక్తిగతంగా గద్దర్ నాకు స్నేహితుడు. మేమిద్దరమూ కళాకారులమే. రాజకీయాల్లో ఆశయ సాధన కోసం ఆయనో దారి ఎంచుకున్నారు' అన్నారు. తన సినిమాకు కథ తయారయ్యాకే పేరు ఉంటుందని, ఇంకా కథ తయారు కాలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X