అన్నామలై పై బీజేపీ హైకమాండ్ ఊహించని నిర్ణయం..!!

తమిళనాడు నేత అన్నామలై పై బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై తో పార్టీ ముఖ్య నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో కొనసాగాలని ముఖ్య నేత లు సూచించారు. దీంతో.. ఢిల్లీలో మకాం వేసిన అన్నామలై తన మనసు మార్చుకుంటారని భావించారు. ఆరెస్సెస్ నేతలు సైతం అన్నామలైతో మాట్లాడారు. దీంతో.. అన్నామలై ఈ రోజున సోషల్ మీడియా వేదిక గా తన అభిప్రాయాలు పంచుకుంటానని వెల్లడించారు. ఈ సమయంలోనే అన్నామలై పైన బీజేపీ నాయకత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించింది.

బీజేపీతో అన్నామలై సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి.. బీజేపీ లో జోష్ పెంచిన అన్నామలైను ఎన్నికల వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. అన్నాడీఎంకే తో పొత్తు కోసమే అన్నామలై ను ఆ పార్టీ నేతల డిమాండ్ మేరకు తప్పించారు. ఇది అన్నామలైకు నచ్చటం లేదు. ఆ తరువాత అన్నాడీఎంకేతో పొత్తు.. బీజేపీ 27 సీట్లకు పరిమితం కావటం సైతం అన్నామలై తొలి నుంచి వ్యతిరేకించారు. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కాగా.. గత వారం తన మద్దతు దారులతో వరుస భేటీలు నిర్వహించిన అన్నామలై పార్టీ అధ్యక్షుడిని కలిసి తన రాజీనామా అందించారు. ఈ లేఖలో అన్ని అంశాలను ప్రస్తావించారు. ఆ తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ సమావేశం అయ్యారు. తాను స్వతంత్రంగా సొంత అజెండాతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని భావిస్తున్నానని అన్నామలై స్పష్టం చేసారు. దీనికి అమిత్ షా బీజేపీ జెండాతోనే యాత్రం చేయాలని సూచించారు.

BJP High Command Accepts Annamalai Resignation after continues negotiations with Him What will be the his next step

అయితే, ఆరెస్సెస్ నేతలు సైతం అన్నామలైతో చర్చలు చేసారు. పార్టీ వీడవద్దని సూచించారు. అన్నామలై నిర్ణయం మార్చుకుంటే రాజ్యసభ తో పాటుగా కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసారు. అన్నామలై మాత్రం తన నిర్ణయంతో మార్పు లేదని తేల్చి చెప్పారు. తమిళనాడు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు.. అన్నాడీఎంకేలో చీలిక.. మారుతున్న సమీకరణాలతో తాను ఒంటరిగానే తమిళనాడులో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు తన మద్దతు దారులకు స్పష్టత ఇచ్చారు. అందులో భాగంగానే తన అభిప్రాయాలను అందరితో పంచుకునేందుకు ఈ రోజు సోషల్ మీడియా ద్వారా స్పష్టత ఇస్తానని వెల్లడించారు. ఇక, అన్నామలై బీజేపీ లో కొనసాగరని నిర్ణయానికి వచ్చేసిన కమలం పార్టీ నాయకత్వం.. తాజాగా అన్నామలై రాజీనామాకు ఆమోదం తెలిపింది. దీంతో.. తమిళనాడులో బీజేపీ ఫైర్ బ్రాండ్ అన్నామలై సంబంధాలు ఇక ఆ పార్టీతో పూర్తిగా కట్ అయిపోయినట్లే. దీంతో.. అన్నామలై భవిష్యత్ ప్రణాళికలు ఏంటనేది ఆసక్తిగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+