తెలంగాణ భవన్ ఎదుట కిరోసిన్ పోసుకొని ఒకరి ఆత్మహత్యాయత్నం

గతంలో తెలంగాణలో చంద్రబాబు పర్యటన సమయంలో వెంకన్న కొడుకు హరిప్రసాద్ చనిపోయాడు. తెలంగాణ రాష్ట్ర సమితి రెచ్చగొట్టడంవల్లే తన కొడుకు ఉద్యమం వైపు దృష్టి మరల్చాడని, ఇప్పుడు తమకు కొడుకు లేకుండా పోయాడని వారు అంతకుముందు ఆరోపించారు. తమకు సహాయం చేస్తామన్న తెరాస నాయకులు తమకు ఏమీ చేయలేదని, స్థానిక నాయకులను సహాయం కోరి కోరి విసిగి పోయి ఇక్కడకు వచ్చామని చెప్పారు. కెసిఆర్ ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశ్యం తమకు లేదని, తమను ఆదుకొమ్మని మాత్రమే వారు కోరుతున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications