రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు రూ. 2 వేల కోట్లు: సిఎం రోశయ్య
State
oi-Pratapreddy
By Pratap
విజయవాడ: వచ్చే ఐదేళ్లల్లో రైల్వే ప్రాజెక్టుల కోసం రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య సర్క్యులర్ రైలును ఆయన బుధవారం విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖ రైల్వే డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో విలీనం చేయాలన్న డిమాండ్‌పై తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. కాజీపేట రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్ విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
విశాఖపట్నం డివిజన్ ను దక్షిణ మధ్య రైల్వేలో విలీనం చేయాలనే డిమాండ్ పై తమ వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే సహాయ మంత్రి మునియప్ప కూడా పాల్గొన్నారు.