రామోజీ రావు రాబందు: జగన్ సాక్షి టీవీ చానెల్ దాడి

Sakshi Daily
హైదరాబాద్: ఈనాడు దినపత్రిక అధినేత రామోజీ రావును కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి టీవీ చానెల్ రాబందుగా అభివర్ణించింది. జగన్ ముందస్తుగా 84 కోట్ల రూపాయల పన్ను చెల్లించడంపై రామోజీరావు మీడియా వార్తాకథనాలను, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో సహా ఇతర నాయకులు ధ్వజమెత్తడాన్ని తప్పు పడుతూ సాక్షి చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. వైయస్ జగన్ ను నెత్తికెత్తుకుంటూ రామోజీని, చంద్రబాబును దుయ్యబడుతూ ఆ వార్తాకథనం ప్రసారమైంది. ఎల్లో సిండికేట్ తప్పుడు ప్రచారాలు సాగిస్తోందంటూ విరుచుకుపడింది. చంద్రబాబుకు జగన్ పోబియా పట్టుకుందని వ్యాఖ్యానించింది. వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు లభిస్తున్న ఆదరణను చూసి రామోజీకి, చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్సించింది. జనం ఎదురు తిరిగి ఎల్లో సిండికేట్ కు సమాధి కడుతుందని తిట్టిపోసింది. తెలుగుదేశం పార్టీని ఎల్లో పార్టీగా అభివర్ణించింది.

చంద్రబాబు, రామోజీ గోబెల్స్ ను మించిపోయారని వ్యాఖ్యానించింది. అబద్ధాన్ని పది మందితో పదే పదే అనిపిస్తే నిజమవుతుందనే ఉద్దేశంతో సిండికేట్ గా తయారైందని వ్యాఖ్యానించింది. దొడ్డిదారిన అధికారంలోకి రావపడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు రామోజీ సహకారం అందిస్తున్నారని చెప్పింది. హైదరాబాదులోని జగన్ ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించడానికి మీడియా ప్రయత్నించిందని, సెక్యూరిటీ గార్డు అడ్డుకుంటే దాడి చేశారని కథలు అల్లిందని చెప్పింది. టీవీ9, స్టూడియో ఎన్ లు జగన్ ఇంటిపై కట్టుకథలు అల్లాయని విమర్శించింది. జగన్ పై రామోజీ రావు కట్టు కథలు రాస్తే ఓ వైపు చంద్రబాబు మరో వైపు తెలుగుదేశం నాయకులు ఎర్రంనాయుడు, గాలి ముద్దు కృష్ణమ నాయుడు వంటి నాయకులు విమర్శలు చేయడం పరిపాటిగా మారిందని, ఓ పద్ధతి ప్రకారం అబద్ధాన్ని నిజం చేయడానికి ఓ వలయంలా పని చేస్తున్నారని వ్యాఖ్యానించింది. లోపాయికారిగా వారంతా చేతులు కలిపారని విమర్శించింది. రామోజీకి చెందిన ఈనాడు దినపత్రికను, ఈటీవి చానెల్ ను సాక్షి చానెల్ విషపుత్రికలుగా అభివర్ణించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+