గ్రామాల్లోకి వస్తే చీపుర్లతో కొట్టండి: మహిళలకు మంత్రి వట్టి సూచన

సూక్ష్మ రుణసంస్థలు సామాన్యులను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రభుత్వం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకువచ్చే ఆలోచనలో ఉందని చెప్పారు. సరియైన క్రమంలో డబ్బులు ఇప్పించటంలో ప్రాజెక్టు డైరెక్టర్లు, బ్యాంకు అధికారులు విఫలమయ్యారని చెప్పారు. అయితే ఈ పాపంలో బ్యాంకులను దోషులుగా చేయొద్దని కోరారు. సూక్ష్మ రుణసంస్థలపై చర్యలు తీసుకునే ఆర్డినేన్సు విషయంలో చర్చించడానికి గురువారం అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
రుణ సంస్థల వేధింపులు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి సారించాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లను వట్టి ఆదేశించారు. ఫిర్యాదులు అందిన వారీగా పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications