కెసిఆర్ తో గద్దర్ ఢీ: డిసెంబర్ 9న బలప్రదర్శనకు పోటీ సభ

ఇదిలావుండగా, డిసెంబర్ 9వ తేదీన వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని తెరాస పొలిట్ బ్యూరో నిర్ణయించింది. అదే రోజు గద్దర్ ప్రజా ఫ్రంట్ హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ తేదీలను తామే ముందు ప్రకటించామని తెరాస, ప్రజా ఫ్రంట్ నేతలు పరస్పరం చెప్పుకుంటున్నారు. కానీ పోటాపోటీ బలప్రదర్శనకు రెండు సంస్థలు కూడా సిద్ధపడుతున్నాయని భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, గద్దర్ గ్రామ పర్యటనలకు శ్రీకారం చుడితే, కెసిఆర్ పల్లె బాటకు పిలుపునిచ్చారు. డిసెంబర్ చివరి వారంలో శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలోగా తమ తమ బలాలను సుస్థిరం చేసుకోవాలని ఇరు వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications