చంద్రబాబు నాయుడు శాడిస్టు కామెంట్ ను తప్పు పట్టిన చిరంజీవి

సూక్ష్మరుణ సంస్థల వద్ద తీసుకున్న రుణాలన్నింటిపైనా ఏడాదిపాటు మారిటోరియం విధించాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రభుత్వాన్ని కోరారు. మైక్రోఫైనాన్స్ సంస్థలను అరికట్టేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటికీ అందులో వడ్డీ రేట్ల నియంత్రణపై ఎలాంటి పరిమితీ లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో వరి దిగుబడులు బాగానే ఉన్నా నిల్వ చేసుకొనే గోదాములు లేక రైతులకు సరైన ధర దక్కడం లేదని చెప్పారు. ఈ విషయంపై ప్రధానికి తాము విజ్ఞప్తి చేస్తామని ఆయన చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలిని రాజకీయాలకు అతీతంగా నియమించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేయాలని చిరంజీవి కోరారు. హైకోర్టు బెంచ్ ల కోసం న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు ప్రకటించారు.












Click it and Unblock the Notifications