సిఎం రోశయ్యపై విసుగు చెంది ఢిల్లీలో తేల్చుకోనున్న చిరంజీవి

రోశయ్య మంత్రివర్గ విస్తరణపై అంతు పట్టని చిరంజీవి కాంగ్రెసు అధిష్టానంతోనే విషయాన్ని తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. నేరుగా కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనో, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తోనో తేల్చుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి త్వరలో ప్రధానిని కలుస్తారని పార్టీ నాయకులు చెప్పారు. రోశయ్య చేతుల్లో ఏమీ లేదని కూడా ఆయనకు చాలా కాలం తర్వాత అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో అధిష్టానంతోనే నేరుగా మాట్లాడాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికల్లో పూర్తి సహకారం అందించిన తమకు ప్రతిఫలం దక్కకపోవడం పట్ల చిరంజీవి అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications