దేశంలో వామపక్ష తీవ్రవాదం పెరుగుతోంది: ముఖ్యమంత్రి రోశయ్య

Rosaiah
హైదరాబాద్: పోలీసులు, వారి కుటుంబాల రక్షణ కోసం ఈ సంవత్సరం ప్రభుత్వం అదనపు నిధులు కేటాయిస్తుందని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. గురువారం అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఆయన నగరంలోని గోషామహల్ స్టేడియంలో సంస్మరణ దినంలో పాల్గొన్నారు. పోలీసులనుండి గౌరవ వందనం స్వీకరించారు.

అంతర్గత తీవ్రవాదం దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుందని ఆయన అన్నారు. దేశంలో మతతత్వ శక్తులు పెరిగి పోయి దేశంలోని పలు ప్రాంతాలపై దాడులు చేస్తున్నారన్నారు. మతతత్వం పెరిగి దాడులకు పాల్పడే వారిని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుందన్నారు. వామపక్ష తీవ్రవాదం రోజు రోజుకు పెరుగుతోందని దాన్ని తుదముట్టించాల్సిన అవసరం ఉందన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం అండగా ఉండి వారిని ఆదుకుంటుందన్నారు. పోలీసులు, వారి కుటుంబాల ఆరోగ్య రక్షణకు, క్వార్టర్ల కోసం ప్రభుత్వం నిధులు ఇస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+