తిరుపతి కాంగ్రెసులో గల్లా అరుణ కుమారి వర్సెస్ చెవిరెడ్డి

Galla Aruna Kumari
తిరుపతి: చిత్తురు జిల్లా తిరుపతిలో మంత్రి గల్లా అరుణకుమారికి కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు నాయకుడు, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి మధ్య ప్రత్యక్ష యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. తాజాగా ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కరరెడ్డి తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు భారీ అక్రమాలకు పాల్పడ్డాడని అందుకు సమాదానాలు ఇవ్వాలంటూ నోటీసు ఇచ్చింది. అయితే ప్రభుత్వం తనపై చేస్తున్న చర్యలకు జిల్లా మంత్రి గల్లా అరుణకుమారి కారణమంటూ చెవిరెడ్డి ఆరోపిస్తున్నారు.

చెవిరెడ్డి భాస్కరరెడ్డి తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు తన సొంతవూరు నిమ్మలకుంటలోని తన ఇంటి వెనుక స్థలాన్ని కొని సుమారు 9 లక్షల రూపాయలతో పెద్ద వ్యాయామశాలను ఏర్పాటు చేసుకున్నాడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆయన అక్రమాలు చెల్లుబాటయ్యాయి. పలు ప్రాంతాల్లో స్థలాలు, ఇళ్లు కొన్నాడు. వీటన్నింటిపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మంత్రి గల్లా అరుణకుమారి తిరుపతిలో తన ప్రాబల్యం పెంచుకోవడానికి తనను బలి చేయాలని చూస్తుందని చెవిరెడ్డి ఆమెపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలో ఒకసారి గల్లా అరుణకుమారి ఇళ్లు అమరరాజకు చెవిరెడ్డి పలువురు కాంగ్రెసు కార్యకర్తలతో ఆందోళన చేయడానికి వెళ్లారు. అయితే గమనించిన పోలీసులు చెవిరెడ్డిని అప్పుడు అమరరాజకు వెళ్లకుండా అడ్డుకున్నారు. తను మంత్రి ఇంటికి దాడి చేయడానికి వెళ్లటం లేదని తాను కేవలం లేఖ ఇవ్వడానికి మాత్రమే వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేయడం దారుణమని అన్నారు. జిల్లా మంత్రి అయి ఉండి సొంత పార్టీ నాయకుడికి, మాజీ తుడా చైర్మన్ ను అయిన నాలేఖే తీసుకోవడానికి రాకుండా పోలీసులతో అడ్డగిస్తుందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించాడు.

ఆ తరువాత కూడా చెవిరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో పలుమార్లు గల్లాపై విమర్శలు గుప్పించారు. అమెకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. చెవిరెడ్డి తనను టార్గెట్ చేసుకోవడాన్ని గల్లా జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో ఆమె ప్రభుత్వం సహాయంతో చెవిరెడ్డిని పరోక్షంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చెవిరెడ్డి జగన్ వర్గీయుడు కావటంకూడా ఆమెకు కలిసి వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+