రక్త చరిత్రతో రాయలసీమలో మళ్లీ ఫాక్షనిజం పెరుగుతుందా?

Ram Gopal Varma
హైదరాబాద్: రామ్ గోపాల వర్మ రక్త చరిత్ర విడుదల నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, అనంతపురం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తీవ్ర వివాదాల మధ్యనే ఆ సినిమా విడుదలవుతోంది. హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి, ప్రత్యర్థి మద్దెలచెర్వు సూరి మధ్య నడిచిన ఫాక్షనిజాన్ని ఇతివృత్తంగా తీసుకుని రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రతీకారాలు, హత్యలు, దాడులు, ప్రతిదాడులు వంటి హింసాత్మక సంఘటనలతో సినిమా నిండి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. వర్మ సినిమాల్లో హింస, సెక్స్ ప్రధాన విషయాలుగా ఉంటాయి కాబట్టి అనంతపురం జిల్లా ఫాక్షనిజం నచ్చిందని, అందుకే రక్త చరిత్ర సినిమా మొత్తం హింస నిండి ఉంటుందని అనుకుంటున్నారు. ట్రయలర్స్ ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. మద్దెలచెర్వు సూరి, పరిటాల రవి - ఇద్దరినీ సినిమాలో హీరోగా చూపిస్తారని, తమ సోదరుడిని విలన్ గా చూపిస్తున్నారని ఓబుల్ రెడ్డి సోదరి ఉమాదేవి చాలా కాలంగా మండిపడుతున్నారు. ఆమె విమర్శలను రామ్ గోపాల వర్మ తిప్పికొడుతున్నారు. ఎవరైనా సినిమా చూసిన తర్వాతనే మాట్లాడాలని ఆయన అంటున్నారు.

రక్త చరిత్ర పాతగాయాలను తట్టి లేపుతుందని, దాని వల్ల అనంతపురం జిల్లాలో ఫాక్షనిజం మళ్లీ పెరుగుతుందని కొంత మంది వాదిస్తున్నారు. బిజెపి నాయకులు ఆ మాటే అంటున్నారు. మాజీ నక్సలైట్ కిష్టప్ప భార్య భూలక్ష్మి కూడా అదే మాట అంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. రేపు శుక్రవారం సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రక్త చరిత్ర సినిమా పోస్టర్లు థియేటర్ల వద్ద తప్ప ఎక్కడా కనిపించడం లేదు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సినిమాను సినిమాగా చూడాలని జిల్లా ఎస్పీ ఎం కె సింగ్ ప్రజలకు విజ్ఝప్తి చేస్తున్నారు. ఎంకె సింగ్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మద్దెలచెర్వు సూరి, పరిటాల రవి వంటి వారిని మోడల్ గా మాత్రమే తీసుకున్నానని, ఇతివృత్తం మాత్రం కల్పితమని, వాస్తవం కాదని రామ్ గోపాల్ వర్మ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా ప్రివ్యూకు ఆయన మద్దెలచెర్వు సూర్యనారాయణ కుటుంబాన్ని, తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత కుటుంబాన్ని ఆహ్వానించినట్లు సమాచారం. మద్దెలచెర్వు సూరితో కలిసి రామ్ గోపాల్ వర్మ అనంతపురంలో సినిమా చూడడానికి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అనంతపురంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మద్దెలచెర్వు సూరితో కలిసి బెంగళూర్ లో సినిమా చూడడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రక్త చరిత్ర సినిమాపై మీడియా తీవ్రమైన ఉత్కంఠను, ఉద్విగ్నతను పెంచుతోంది. ఎప్పటికప్పుడు వివాదాలను వెలికి తీస్తూ పెద్ద యెత్తున టీవీ చానెళ్లు వార్తాకథనాలను ప్రసారం చేస్తున్నాయి. ప్రత్యేక చర్చా కార్యక్రమాలను పెడుతున్నాయి. రామ్ గోపాల వర్మతో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశాయి. ఆయనతో చర్చాగోష్టులు నిర్వహించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+