అధిష్టానం ఏ పదవి అప్పగించినా నిర్వహిస్తా: పొంగులేటి

ఇటీవల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి తీరు బాగా లేదన్నారు. ఆయన ప్రధానిపై చేసిన వాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన తీరు ఇప్పటికైనా మారాలి. లేకుంటే చంద్రబాబు భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఎలా ప్రవర్తించాలో తెలియక పోవటం కన్నా దురదృష్టం మరొకటి లేదన్నారు. ప్రభుత్వం ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాలపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలన్నారు. ఎమ్మార్ అక్రమాల వల్ల ఏపీఐఐసికి పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని చెప్పారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ కు తెలంగాణపై చిత్తశుద్ది లేదని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాకుండా ఉందన్నారు. కేవలం పార్టీని రక్షించుకోవడానికే ఆయన తెలంగాణను ఉపయోగించుకుంటున్నాడని ఆరోపించారు.












Click it and Unblock the Notifications