కెసిఆర్ పై భగ్గుమన్న కాంగ్రెసు కర్నూలు ఎమ్మెల్యే టిజి వెంకటేష్

TG Venkatesh
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేకపోతే ఆందోళన చేయడానికి లక్షల మంది విద్యార్థులను సమాయత్తం చేయడానికి సిద్ధపడిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు కర్నూలు శాసనసభ్యుడు, రాయలసీమ హక్కుల వేదిక కన్వీనర్ టిజి వెంకటేష్ భగ్గుమన్నారు. విద్యార్థులను అడ్డం పెట్టుకుని కెసిఆర్ రాజకీయం చేయడం ద్రోహమని, అన్యాయమని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. డిసెంబర్ తర్వాత తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, అందుకు లక్షల మంది విద్యార్థుల మద్దతు కూడగడుతానని కెసిఆర్ అనడం సరి కాదని ఆయన అన్నారు. రాజకీయ సమరం చేయాలే తప్ప విద్యార్థులను అడ్డం పెట్టుకుని ఆందోళన చేయడం ద్రోహమని ఆయన అన్నారు. విద్యార్థులు కెసిఆర్ కుయుక్తులను గ్రహించాలని ఆయన కోరారు.

ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తెరాస చెల్లని చెక్కులు ఇచ్చిందని, విద్యార్థులకు ద్రోహం చేస్తోందని ఆయన అన్నారు. హైదరాబాదును రెండవ రాజధానిగా చేయాలని ఆయన కోరారు. వేసవి సెలవుల్లో రాష్టపతి కూడా హైదరాబాదు విడిదికి రావడం సంప్రదాయంగా ఉందని, అందువల్ల ప్రజలు హైదరాబాదును దేశ రెండవ రాజధానిగా చేయాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. రాజ్యాధికారం వస్తే ఏం చేస్తారో కెసిఆర్ చెప్పడం లేదని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కూడా ఆయన మండిపడ్డారు. పరిపాలనపై తమ పార్టీ నాయకులంతా కలిసి దృష్టి సారిస్తారని, ఇతర విషయాల్లో వ్యక్తిగతాభిప్రాయాలు వెల్లడిస్తారని, తమ పార్టీలో తమకు ఆ స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో స్వేచ్ఛ ఉండదని, అందుకే తాము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+