తెలంగాణను కెసిఆర్ కుటుంబం నుంచి రక్షించాలి: తలసాని

Talasani Srinivas Yadav
హైదరాబాద్‌: తెలంగాణను మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావు తన సొంత ఆస్తిగా అనుకుంటూ తెలంగాణ పేరు చెప్పి కొల్లగొడుతున్నాడని సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ తెరాస, చంద్రశేఖర కుటుంబ కబంద హస్తాల్లో కూరుకు పోయిందని అన్నారు. వారి కబంద హస్తాల నుండి రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

పనిగట్టుకుని తమ అధినేత చంద్రబాబుపై కెసిఆర్, తెరాస పార్టీలు అభాండాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. ట్యాంక్‌బండ్‌పై కొమరం భీం విగ్రహం పెట్టకపోతే మిగతా విగ్రహాలు కూల్చివేస్తామని సిరిసిల్ల శాసన సభ్యుడు కె. తారకరామారావు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన ప్రకటన దారుణమని ఆక్షేపించారు.కేసీఆర్‌ స్వయంకృతం వల్లే తెలంగాణలో ఉప పార్టీలు పుట్టుకొచ్చాయని ఎద్దేవా చేశారు. అవి రాజకీయ రూపు సంతరించుకోనప్పుటికీ ముందు ముందు రాజకీయరూపులోకి రావచ్చని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+