ఈనెల 5న కాక్రోచ్ జనతా పార్టీ కోర్‌ కమిటీ సమావేశం.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ..

దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంపై దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చేపట్టిన నిరసనల ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన ప్లేస్ లో ప్రహ్లాద్ జోషీ నియమితులయ్యారు. దాదాపు నెల రోజుల పాటు చేపట్టిన ఆందోళనల్లో ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేశారు.

జూలై 20న సీజేపీ చేపట్టిన 'ఛలో సంసద్' యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. బాష్ప వాయువును ప్రయోగించారు. ఎట్టకేలకు ప్రధాన్ రాజీనామాతో నెల రోజులకు పైగా సాగిన సీజేపీ ఉద్యమం విజయవంతంగా ముగిసింది.

ఆ తర్వాత విద్యార్థులు, యువతకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వరుసగా వీడియోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ప్రధాని మోదీకి కౌంటర్ ఇస్తూ వచ్చారు. మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ లో సీజేపీ కీలక సభ్యులతో ఆగస్టు 5 న కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ భేటీ అభిజిత్ దిప్కే ఇంట్లోనే జరగనుంది. మరోవైపు సీజేపీ ఉద్యమంలో పాలు పంచుకున్న విద్యార్థులు కొద్ది రోజుల పాటు తమ తల్లిదండ్రులతో గడిపేందుకు వెళ్లినట్లు సమాచారం అందుతోంది.

Cockroach Janata Party core committee meeting the 5th of this month discussion future course action

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే చిన్నారులతో కలిసి ఫ్రెండ్ షిప్ డే నిర్వహించారు. ఇదిలాఉంటే అభిజిత్ దిప్కే కుటుంబ వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాలని సూరత్ కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+