హైదరాబాద్: హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలోనుండి సంవత్సరం కూడా నిండని చిన్నారి బాలుడిని ఎత్తుకుపోయిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. అజయ్ అనే 11 నెలల బాలుడిని బుర్ఖా వేసుకున్న ఓ మహిళ తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మూరు వాసులు. తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.