భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం: వేలాది ఎకరాల పంట నష్టం

Heavy Rains
హైదరాబాద్: భారీ వర్షాలతో రాష్ట్రం సతమతమవుతోంది. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు విశాఖపట్నం జిల్లా గాజువాకలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెదగంట్యాడ, హౌసింగ్‌బోర్డు, డెయిరీ, బర్మా, కంచుమాంబ, వడ్లపూడి కాలనీలు జలమయమయ్యాయి. ఎస్‌. రాయవరం మండలం బసవపాడు వద్ద వరహానదికి గండి పడడంతో గెడ్డపాలెం, పెనుగొల్లు, సైతారిపేట జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 500 ఎకరాల్లో పంట నీటమునిగింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. యలమంచిలిలో వరహా, శారదా నదులు పొంగిపొర్లుతున్నాయి. దాదాపు 2 వేల ఎకరాల్లో పంట నీటమునిగింది. జిల్లాలోని అన్ని ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో అధికారులు కంట్రోల్‌ రూంలను ఏర్పాటుచేశారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం, టోల్‌ఫ్రీ నంబరు 1077ను ఏర్పాటు చేశారు.భారీ వర్షాలకు విజయనగరం జిల్లాలోని 20 వేల హెక్టార్లలో వరిపంట నీటమునిగింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలకు దాదాపు 20 వేల హెక్టార్లలోని వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.

వర్షాల తాకిడికి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 500 ఇళ్లు నేలకూలాయి. భారీ వర్షాలకు తుని, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలోని లోతట్లు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 200 కి.మీ. మేర రహదారులు ధ్వంసం అయ్యాయి. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. జిల్లాలో సగటు వర్షపాతం 11.2 సెం.మీ.లు, కరప మండలంలో అత్యధికంగా 22.2 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. సహాయ చర్యలు అందిచేందుకు జిల్లా కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబర్‌ 1077ను ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో 10 వేల ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. నర్సాపురం తీరప్రాంతంలో ఉప్పుటేరు పోటెత్తుతోంది. తణుకు, ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు మండలాల్లో 15వేల ఎకరాల్లో వరిపంట నీటమునిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+