నల్గొండ: నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ నాయకుల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ముందుగా మంత్రి కోమడిరెడ్డి వెంకటరెడ్డి శవయాత్రను నిర్వహించారు. అందుకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు దిష్టిబొమ్మను దహనం చేశారు.
కెసిఆర్ దహనాన్ని తెరాస నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ వారు దానిని తిప్పికొట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.