శ్రీకృష్ణ కమిటీ నివేదికను బట్టే తెలంగాణపై నిర్ణయం: చిదంబరం

రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఆంధ్రప్రదేశ్ కు అదనపు బలగాలను పంపించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. డిసెంబర్ తర్వాత శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చుననే అనుమానాల నేపథ్యంలో చిదంబరం ఆ విషయం చెప్పినట్లు భావిస్తున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణ ఉద్యమాన్ని బలగాలతో ఆపలేరని, ఇది ప్రజల గుండెల్లోంచి పుట్టిన ఉద్యమమని ఆయన అన్నారు. గతంలో కూడా పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణచివేయలేకపోయారని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications