చిత్తూరు: చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలంలో ఘోర రహదారి ప్రమాదం జరిగింది. అందులో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. పుంగనూరు నుండి చిత్తూరు వెళుతన్న ఒక ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను పుంగనూరు - చిత్తూరు రహదారిలోని బద్దందొడ్డి క్రాస్ దగ్గర ఢీ కొట్టింది. ఆటోలో అప్పుడు ఏడుగురు ఉన్నారు. అందులో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులోని వారికి మరికొందరికి గాయాలయ్యాయి. దీంతో అతన్ని పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆర్టీసీ బస్సు వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.