కెవిపి రామచందర్ రావు పందికొక్కులకు దోచిపెట్టారు: చంద్రబాబు

తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ఎమ్మార్ తో చేసుకున్న ఒప్పందాలకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తూట్లూ పొడిచిందన్నారు. రహేజా సంస్థతో మా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను వైయస్ ప్రభుత్వం సవరించడానికి గల కారణాలు ఏమిటన్నారు. సవరణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వారే ఒప్పందాలు చేసుకున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కొందరు పందికొక్కులకు ప్రాజెక్టులు దోచి పెట్టడానికి కెవిపి రామచంద్రారావు చూస్తున్నారని ఆరోపించారు.
భారీ వర్షాలు వచ్చి రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీట మునిగిపోతే ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు మొక్కుబడిగా ఉన్నాయన్నారు. వరద నష్టం అంచనాలపై అధికారుల చేస్తున్న పర్యవేక్షణ కూడా తూతూ మంత్రంగా ఉందని ఆరోపించారు. గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు సహాయంగా రూపాయలు వెయ్యి కోట్లు ఇస్తానన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగు మాట తప్పాడని అన్నారు.












Click it and Unblock the Notifications