ముఖ్యమంత్రి తన సొంత జిల్లానే పట్టించుకోవటం లేదు: గాలి
State
oi-Srinivas G
By Srinivas
గుంటూరు: ముఖ్యమంత్రి రోశయ్య తన సొంత జిల్లా అయిన గుంటూరు జిల్లాలో కూడా రైతులు తీవ్ర నష్టాలతో, పలు సమస్యలతో ఉన్నా పట్టించుకోకపోవటం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి గాని, కేంద్ర ప్రభుత్వానికి గాని కాంగ్రెసు వర్కింగ్ కమిటీపై ఉన్న ప్రేమ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై, రైతుల సమస్యలపై లేదని ఎద్దేవా చేశారు. రైతులు వర్షాలతో నష్టపోయి అల్లాడుతుంటే మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యమంత్రి రోశయ్య కూడా పట్టించుకోవటం లేదన్నారు.