హీరో నవదీప్ కు రూ. 25వేల జరిమానా: కేసు మూసివేత

Navdeep
నల్లగొండ: అనుమతి లేకుండా నల్లమల అటవీ ప్రాంతంలోని సాగర్ జలాశయంలో స్పీడ్‌బోట్‌తో విహారానికి వెళ్లిన కేసులో మంగళవారం సినీ నటుడు నవదీప్, అతని స్నేహితులు, వాహనాల డ్రైవర్లకు అటవీ అధికారులు రూ. 25వేల జరిమానాను విధిస్తూ కేసును మూసివేశారు. వన్యప్రాణుల చట్టం 1972 ప్రకారం వారిపై కేసు నమోదు చేసిన అటవీశాఖ దీనిపై విచారణ జరిపిందని, వారివద్ద ఎలాంటి ఆయుధాలూ లేవని, జంతువుల వేటకు అటవీప్రాంతంలోకి వెళ్లలేదని తేలడంతో వారిని వదిలిపెట్టామని డీఎఫ్‌వో ఉదయ్‌శంకర్, రేంజర్ జనార్దన్ తెలిపారు.

ఇటీవల హీరో నవదీప్ తన మిత్రులతో కలిసి కృష్ణానదిలో బోటు షికారుకు వెళ్లి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఏడుగురు మిత్రులతో ఓ ప్రైవేట్ బోటును అద్దెకు తీసుకుని కృష్ణానదిలో షికారుకు వెళ్లారు. నదిలో పడవ ఆగిపోవడంతో వారు నదిలో చిక్కుకుపోయారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని రక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+