హరీష్ రావుపై కేసు పెట్టిస్తా: మల్లు భట్టి విక్రమార్క హెచ్చరిక

తెరాస నాయకుడు, సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు పర్యాటక శాఖామంత్రి గీతారెడ్డి ఇంటిపై ఆమె లేని సమయంలో దాడి చేయటం హేయమని అన్నారు. దాడి కేసులో సైతం ఆయన తప్పించుకొని అమాయకులను అందులో ఇరికిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రజల కోసం జైలుకైనా వెళతామన్న హరీష్ రావు ఆ జైలు నుండి తప్పించుకోవడానికి సాటి తెలంగాణ వారిని జైలుకు పంపిస్తున్నాడని విమర్శించారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. హరీష్ రావుపై కేసు పెట్టిస్తానని, ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడుతానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications