వైఎస్ కన్నా రోశయ్య తక్కువేమీ కాదు: చంద్రబాబునాయుడు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని దోచి సొంతవారికి పెట్టాడన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య కుడా తక్కువేమీ కాదని విమర్శించారు. ప్రభుత్వానికి తెలుగుపై అభిమానం లేకే తెలుగు లలిత కళా తోరణానికి రాజీవ్ పేరును పెట్టాలని చూసిందని అయితే తెలుగు దేశం పార్టీ ఉద్యమించి దానిని అడ్డుకున్నదని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీకీ తెలుగుకు సంబంధమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇంత తుఫాను వచ్చి ప్రజలు బాధపడుతుంటే మంత్రులు వచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చినది లేదని ఆయన దుయ్యబట్టారు. బాధితులకు పునరావాస కేంద్రాల ఏర్పాటులోగానీ, ఆదుకోవటంలోగానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications