అద్దిరిపోయే ఊటీ టూర్ ప్యాకేజీ.. చీప్ అండ్ బెస్ట్.. 4 రోజులు పండగే..!
ఈ రోజుల్లో అందరూ ఉరుకులు పరుగులు, బిజీ బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. వీక్ మొత్తం ఎంజాయ్ చేసి వీకెండ్ లో కాస్త రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారు. అయితే వారాంతం, ఇతర సెలవుల్లో చాలా మంది దగ్గరలోని టూరిస్టు ప్రాంతాలను విజిట్ చేస్తుంటారు. మరికొంతమంది ఇతర రాష్ట్రాల్లోని ప్రకృతి రమణీయమైన ప్రదేశాలను ఆస్వాధించేందుకు వెళ్తుంటారు. అయితే తమిళనాడులోని ఫేమస్ హిల్ స్టేషన్ అయిన ఊటీని సందర్శించాలని చాలా మందికి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని 'క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్' అని పిలుస్తుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి ఎలా చేరుకోవాలో తెలియక అనేక ఇబ్బందులు పడుతుంటారు. వారికోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్దిరిపోయే టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. చీప్ అండ్ బెస్ట్ పద్ధతిలో తక్కువ ధరకే ఊటీ, కూనూర్ ఇతర టూరిస్ట్ ప్రాంతాలను చుట్టేసిరావచ్చు.
ఇక ఈ టూర్ మొత్తం 3 రాత్రులు, 4 రోజులపాటు కొనసాగుతుంది. ప్యాకేజీ ధర విషయానికి వస్తే ఒక్కొక్కరికీ రూ. 13, 260 గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో భాగంగానే హోటల్ ఫెసిలిటీ, ఫుడ్, స్థానిక రవాణా లాంటి పలు సదుపాయాలను IRCTC కల్పిస్తోంది. తక్కువ ధరకే ఊటీలోని అనేక పర్యాటక ప్రాంతాలను చుట్టేసే అవకాశం ఉంది కాబట్టి నేచర్ లవర్స్ ఈ టూర్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఊటీ టూర్ లో భాగంగా ఊటీ బొటానికల్ గార్డెన్స్, ఊటీ సరస్సు, దోడబెట్ట శిఖరం, రోజ్ గార్డెన్, పైకారా జలపాతం తదితర ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంది.

అలాగే ఊటీలో నీలగిరి మౌంటెన్ ట్రైన్ జర్నీ, టీ తోటలు, మధుమలై నేషనల్ పార్క్, ఇతర ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు పర్యటకులకు ఆహ్లాదకరమైన ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాక ఊటీలో బ్రిటిష్ కాలం నాటి నిర్మాణాలు, అందమైన సరస్సులు, పూల తోటలకు ప్రసిద్ధి చెందింది. ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రఫీ ఆసక్తి ఉన్నవాళ్లు, కుటుంబంతో ప్రశాంతమైన సమయాన్ని గడపాలనుకునేవారికి ఈ పర్యటన చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ సమాచారం కోసం IRCTC టూరిజం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications