ఢిల్లీకీ చేరుకున్న ఒబామా: ప్రొటోకాల్ పక్కనపెట్టి స్వాగతం పలికిన మన్మోహన్
National
oi-Srinivas G
By Srinivas
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భార్య మిచెల్ తో కలిసి ఆదివారం మధ్యాహ్నం ముంబయి నుండి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఆయన సతీమణి గురుశరణ్ కౌర్‌లు ఒబామా దంపతులకు స్వయంగా స్వాగతం పలికారు. ఒబామా రాక సందర్భంగా ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి మన్మోహన్ దంపతులు పాలమ్ విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికారు. వీరితో విదేశాంగ కార్యదర్శి నిరుపమరావు కూడా ఉన్నారు. పాలమ్ ఎయిర్‌పోర్టు నుంచి ఒబామా దంపతులు రూస్‌వెల్ట్ హౌజ్‌కు తరలివెళ్లారు.