కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు దద్దమ్మలు, స్వార్థపరులు: చిరంజీవి

ఉభయగోదావరి జిల్లాల్లో కుండపోత వర్షాలతో బాగా నష్టపోయింది కౌలు రైతులేనని వారికి ప్రజారాజ్యం పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత చిరంజీవి భరోసా ఇచ్చారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో అతివృష్ఠి బాధితులను చిరంజీవి పరామర్శించారు. కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందడం లేదని, ఈ విషయాన్ని వారం క్రితమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వారిని ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అది నెరవేరేలా ప్రజారాజ్యం పార్టీ కృషి చేస్తుందన్నారు. డ్రెయిన్లు పూడికలు, ఆక్రమణలతో నిండిపోవడంతో రైతులు వర్షాలు, వరదలు వచ్చిన ప్రతిసారీ తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. డెల్టా ఆధునికీకరణకు నిధులు ఉన్నా అవినీతి కారణంగా పనులు సరిగా జరగడం లేదని చిరంజీవి ఆరోపించారు. ప్రకృతి రైతులపై కక్షగట్టి వెంటాడుతుంటే వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.
ఖరీఫ్‌లో తడిచిన ధాన్యానికి పూర్తి మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని, వర్ష బాధితులకు 50కేజీల బియ్యం, 10 లీటర్ల కిరోసిన్ అందివ్వాలని చిరంజీవి డిమాండ్‌చేశారు. ఆదివారం ఉదయం గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో కాకినాడ చేరుకున్న చిరంజీవి కాకినాడ గ్రామీణం, సామర్లకోట, పిఠాపురం తదితర మండలాల్లో పర్యటించారు. కాకినాడ ఆర్ అండ్ బి అతిథిగృహంలో జిల్లాలో పంట నష్టాలపై ఏర్పాటుచేసిన ఫొటో ప్రదర్శన తిలకించారు. సామర్లకోట మండలం, వి.కె.రాయపురంలలో పంటలను పరిశీలించారు. సీడిగ, సర్పవరం, గొల్లప్రోలు మండలంలోని బీసీ కాలనీలోని ఇళ్లను పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications