చంద్రబాబు నాపై కోపగించుకోలేదు: నాగం జనార్దన్ రెడ్డి

హైదరాబాద్ ఫ్రీజోన్ విషయంలో కాంగ్రెసు నాటకాలు ఆడడానికి ప్రయత్నిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. తెలంగాణకు మొదటి నుంచీ కాంగ్రెసు పార్టీయే మోసం చేస్తోందని ఆయన అన్నారు. హైదరాబాద్ ఫ్రీజోన్ విషయంలో కాంగ్రెసు డ్రామాలు ఆడే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆరో జోన్ లో భాగమని అసెంబ్లీలో తీర్మానం చేసి నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. హుస్సేన్ సాగర్ ఖాళీగా ఉందని వ్యాఖ్యానించడం ద్వారా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు విద్యార్థులను రెచ్చగొట్టాయని ఆయన అన్నారు. తెలుగుదేశం నాయకులు టి. దేవేందర్ గౌడ్, విజయరామారావు కూడా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications