ముఖ్యమంత్రిగా రాజీనామాపై రోశయ్యకు కూడా తెలియదా?

మంగళవారం ఢిల్లీలో కూడా రోశయ్యకు అధిష్టానం పెద్దల నుంచి ఆశ్చర్యకరమైన ప్రశ్నలు ఎదురైనట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, ఫ్రీజోన్ రగడ ఎంత వరకు వచ్చింది, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటి వంటి ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం సిఎల్పీ సమావేశం ఏర్పాటు విషయం కూడా తొలుత రోశయ్యకు చెప్పలేదని అంటున్నారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత విషయం చెప్పారని సమాచారం. సిఎల్పీ సమావేశం ఎజెండా కూడా రోశయ్యకు చెప్పలేదని అంటున్నారు. ఈ స్థితిలోనే గవర్నర్ కు రాజీనామా సమర్పించిన తర్వాత ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications