ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరు ఖరారు?

S Jaipal Reddy
న్యూఢిల్లీ: కొత్త ముఖ్యమంత్రిగా చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు జైపాల్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారు అయిపోయినట్టే తెలుస్తోంది. ఏఐసిసి వైయస్జగన్ కు చెక్ చెప్పేందుకు రెడ్డి వర్గానికి చెందిన వారికే ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు వచ్చాయి. శాసనసభాపతి కిరణ్ కుమార్ రెడ్డి, పర్యాటక శాఖమంత్రి గీతారెడ్డి, మాజీ హోంమంత్రి జానారెడ్డి, జైపాల్ రెడ్డి పేర్లు మొదట వినిపించాయి. అయితే కాంగ్రెసు అధిష్టానం జైపాల్ రెడ్డివైపే చివరకు మొగ్గు చూపినట్లు అంతర్గత సమాచారం. కాగా జైపాల్ రెడ్డి మాట్లాడారు. మీడియాలోనే తన పేరు వినిపిస్తుందని, హైకమాండ్ దగ్గర అలాంటి సమాచారమేమీ తన వద్ద లేదని ఆయన అంటున్నారు. జైపాల్ రెడ్డి అహ్మద్ పటేల్ ను, ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ప్రణబ్ ముఖర్జీతో జైపాల్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రిపై సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం.

అధిష్టానానికి తలబొప్పి కట్టిస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్పడానికి రెడ్డి వర్గానికి చెందిన వారిని, అలాగే శ్రీకృష్ణ కమిటీ నివేదిక డిసెంబర్ 31న ఇస్తున్నందున తెలంగాణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణకు చెందిన వ్యక్తికి ఇవ్వాలని కాంగ్రెసు అధిష్టానం యోచించినట్లు తెలుస్తోంది. అందుకే అధిష్టానం రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని పక్కకు పెట్టి తెలంగాణకు చెందిన జైపాల్ రెడ్డిని పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చుండబెడితే ఫిబ్రవరిలో ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెట్టనప్పటికీ తెలంగాణలో జరిగే అలజడిలను తగ్గించవచ్చని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+