వైయస్ జగన్ కు కెవిపి దూరమే: ముఖ్యమంత్రి రోశయ్యతో విందు

కెవిపి రామచందర్ రావు మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎపి భవన్ లో రోశయ్యతో కలిసి భోజనం చేశారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి కాటేజీలో కేంద్ర పనబాక లక్ష్మి, పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివరావు, మాగుంట శ్రీనివాస రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, సబ్బం హరి, రాయపాటి సాంబశివరావు, వి హనుమంతరావు కూడా ఉన్నారు. వీరిలో అనంత వెంకట్రామిరెడ్డి, సబ్బం హరి వైయస్ జగన్ కు అనుకూలంగా ఉన్నారని చెబుతారు. రాయపాటి సాంబశివ రావు, వి. హనుమంతరావు కలిసి వెళ్లి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వెంట పిసిసి క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications