వైయస్ జగన్ మిషన్: వీరప్ప మొయిలీ గుర్రు, తీవ్ర వ్యాఖ్య

వైయస్ జగన్ వ్యవహారాన్నే కాకుండా రాష్ట్రంలోని పార్టీ వ్యవహారాలను నేరుగా సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పర్యవేక్షిస్తున్నారని, వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తుండడం వల్ల మొయిలీని పక్కన పెట్టారని, సాంకేతికంగా మాత్రమే మొయిలీ ఇంచార్జీగా కొనసాగుతున్నారని తెలుస్తోంది. వైయస్ జగన్ కు వ్యతిరేకంగా తీసుకునే చర్యలను, జగన్ పట్ల అనుసరించాల్సిన వైఖరిని సోనియా గాంధీ అహ్మద్ పటేల్ ద్వారా ఖరారు చేయించి, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యతను మొయిలీకి అప్పగించినట్లు తెలుస్తోంది. మొయిలీ ద్వారా తమ వ్యూహాన్ని అమలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
వైయస్ జగన్ పార్టీ వీడరని, నెల్లూరు ఓదార్పు యాత్ర జరిగిన తర్వాత వెనక్కి తగ్గుతారని మొయిలీ సోనియాకు చెబుతూ వచ్చారు. అయితే, జగన్ లో ఏ మాత్రం మార్పు రాలేదు. పైగా, ఎదురు దాడికి దిగుతున్నారు. ఆ దాడులకు తనకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మొయిలీపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ మొయిలీకి మింగుడు పడడం లేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications