చిరంజీవికి వైయస్ జగన్ కన్నా ఎక్కువ ఇమేజ్ ఉందా: కొండా సురేఖ

Konda Surekha
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాధరణ, ఇమేజ్ ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవికి ఉందా అని మాజీ మంత్రి, శాననసభ్యురాలు కొండా సురేఖ సోమవారం జగన్ రాజీనామా అనంతరం ధ్వజమెత్తారు. జగన్ ను కాదని కాంగ్రెసు అధిష్టానం చిరంజీవిని దగ్గరకు తీయడమేమిటని ఆమె ప్రశ్నించారు.

వైయస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకానందను ఢిల్లీకి పిలిపించి మంత్రిపదవి ఆశ చూపడంతోనే జగన్ ఆవేదన చెందారన్నారు. అంతకుముందు అన్ని అవమానాలను దిగమింగారన్నారు. ప్రజాసేవకోసం ప్రాణాలర్పించిన మహానాయకుడు వైయస్ రాజశేఖరరెడ్డి కొడుకుకు ఇంత అవమానమా అన్నారు. ఇది జగన్ కు మాత్రమే అవమానం కాదని, ప్రజలందరికీ అవమానమన్నారు. ఆయన రాజీనామా నిర్ణయం ముందుగా తమకు తెలియజేయలేదన్నారు. జగన్ కు పార్టీని దెబ్బతీసే ఉద్దేశ్యమేదీ లేదన్నారు.

150 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రిగా జగన్ ఆమోదించి సంతకాలు చేసినప్పుడే పార్టీకి వ్యతిరేకంగా ఏ పనినీ చేయలేదన్నారు. జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పూడు ప్రవర్తించలేదు, ఇప్పుడూ కూడా ప్రవర్తించడన్నారు. జగన్ ఓదార్పుకు వస్తున్న ఆదరణ చూడలేకనే కొందరు ఆయన ఇమేజ్ ను దెబ్బతీసే చర్యలకు పూనుకుంటున్నారన్నారు. తమ కుటుంబం వైయస్ కుటుంబానికి మంచి అభిమానులమన్నారు. ఆయన ఏం చేసినా మా కుటుంబం అండగా ఉంటుందని ప్రకటించారు. అయితే వైయస్ కోరిక మేరకు 2014 వరకు ప్రభుత్వం కొనసాగుతుందని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+