రాజకీయాలకు వైయస్ వివేకానంద రెడ్డి గుడ్ బై చెప్తారా?

అప్పుడు వివేకానంద అక్కడేన్న జగన్ తో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. జగన్ వ్యవహారంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. కాంగ్రెసు అధిష్టానం తనకు మంత్రి పదవి ఇవ్వడాన్ని జగన్ కుటుంబాన్ని చీల్చే కుట్రగా అభివర్ణించడాన్ని, తానేదో జగన్ ను దెబ్బతీసే కుట్రలో భాగస్వామిని అయినట్లు తనపై జగన్ వర్గీయులు పరోక్ష విమర్శలు చేయడాన్ని నొచ్చుకున్నట్టు సమాచారం. అందుకే ఆయన సోమవారమే మంత్రిపదవిని తీసుకోనన్నారు. అయితే జగన్ తో వివేకానంద భేటీ అయినా వారిద్దరి మధ్య సయోధ్య కుదరలేదు.
ఇద్దరు రెండు నిమిషాలు కూడా మాట్లాడుకోక ముందే వివేకానంద బయటకు వచ్చేశారు. ఇటు కాంగ్రెసు అధిష్టానం, అటు జగన్ ఒత్తిడుల కారణంగా మనశ్సాంతిగా ఉండలేక పోతున్నానని వివేకానంద అభిప్రాయపడుతున్నారు. అందుకే పూర్తిగా రాజకీయాల్లోంచే వైదొలిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications