హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పార్టీ పెట్టినప్పుడు మాట్లాడుతా: కె. చంద్రశేఖర రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar rao
హైదరాబాద్: డిసెంబర్ 31లో నివేదికను శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి ఇస్తానని చెప్పిందని, నివేదిక అనంతరం కేంద్రం తెలంగాణ ఇవ్వాల్సి ఉంటుందని ఆలా కాదంటే ముందు ముందు అసలు పంచాయతీ ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ సాధనలో భాగంగా వరంగల్లో నిర్వహిస్తున్న తెలంగాణ మహాగర్జనకు భారీగా తెలంగాణవాదులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. మహాగర్జన ఏర్పాట్లను ఆయన వివరించారు. విద్యాసంస్థలు 9వ తేదిన సెలవు ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పలు ప్రయివేటు పాఠశాలలు సెలవు ప్రకటించి వారి బస్సులను తెలంగాణ గర్జన కోసం వినియోగిస్తున్నారన్నారు.

తెలంగాణ జర్నలిస్టుల సభ ఊహించినదానికంటె ఎక్కవగా ఎలా విజయవంతమైందో మహాగర్జన కూడా అదేవిధంగా విజయవంతమవుతుందన్నారు. కెసిఆర్ అన్ని వర్గాల వారిని మహాగర్జనకు ఆహ్వానించారు. ఇప్పటికే వెయ్యి మంది కార్యకర్తలు సభ ఏర్పాటు పనుల్లో ఉన్నారన్నారు. స్టేజికి ఇరువైపులా ప్రజలకు వీలుగా స్ర్కీన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారతదేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద సభ కానుందని ఆయన చెప్పారు. సుమారు 25 లక్షల మంది వస్తారన్నారు. యువకులు, విద్యార్థుల సభకు వచ్చేటప్పుడు స్వయం నియంత్రణ పాటించాలన్నారు.

మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టినప్పుడు మాట్లాడుతామని విలేకరులు ఓ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయన పార్టీ పెట్టి విధివిధానాలు ప్రకటించిన తర్వాత స్పందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైకమాండ్ నిర్ణయమే తన నిర్ణయమని చెప్పారని కేసిఆర్ చెప్పారు. మందకృష్ణ మాదిగను కలుసుకోపోవడాన్ని రాజకీయ చేయవద్దని ఆయన కోరారు. మహాగర్జన బిజీలో ఉన్న నాకు ఆయన్ను కలవటం వీలు కాలేదన్నారు. మందకృష్ణ తనపై చేసిన కామెంటును పట్టించుకోనని చెప్పారు.

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కెసిఆర్ డిమాండు చేశారు. లేదంటే తెలంగాణ ప్రజల దెబ్బను కేంద్రం రుచి చూడాల్సి వస్తుందన్నారు. గద్దర్ డిసెంబర్ 9న వేరే కార్యక్రమం పెట్టుకున్నందున తెలంగాణ మహాగర్జనకు పిలవలేదన్నారు. గద్దర్ అయినా మరెవరయినా తెలంగాణ అంటే అందరం ఏకమవుతామన్నారు. తెలంగాణ సభ ఎక్కడ జరిగినా విజయవంతం చేయాల్సిందేనన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X