అధికారులు సహకారం లేక నిజామాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ రాజీనామా

Nizamabad
నిజామాబాద్: అధికారులు సహకరించక పోవటంతో నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వెంకటరమణారెడ్డి బుధవారం మధ్యాహ్నం తన పదవీకి రాజీనామా చేశారు. అధికారుల తీరును ఆయన తీవ్రంగా నిరసించారు. గత రెండు రోజులుగా జరుగుతున్న సమావేశాలకు విద్యుత్, నీటిపారుదల తదితర శాఖలకు సంబంధించిన అధికారులు హాజరు కావటం లేదు. బుధవారం సైతం వారు హాజరు కాలేదు. దీంతో విపక్ష నాయకులు తమకు సమాధానాలు ఎవరు చెబుతారు అంటూ ఆయన్ను నిలదీశారు. అధికారులు సహకరించకుండా విపక్షాలకు జవాబులు చెప్పే అధికారులు రాకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వెంకటరమణారెడ్డితో మరో ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులు కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

పలు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించేందుకు చర్చించడానికి వారు హాజరు కావటం లేదు. వెంకటరమణారెడ్డి అక్కడున్న ఓ డిఆర్వోకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. మంగళవారం కేవలం ముగ్గురు అధికారులే రావడం ప్రజల సమస్యలపట్ల అధికారులకు ఉన్న నిబద్దతకు అద్దం పడుతోంది. అధికారులు ఇప్పుడు మాత్రమే కాదు సమావేశాలకు ఎప్పుడూ గంటలు గంటలుగా ఆలస్యంగా వచ్చే వారని కొందరు జెడ్పీటీసీ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారికి ప్రజా సమస్యలపై శ్రద్ధ లేదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+