హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు బాబ్లీ యాత్ర ఖర్చు రూ. 20 లక్షలు, చెల్లింపునకు రెడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బాబ్లీ యాత్ర ఖర్చును చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రూ.20 లక్షలను గురువారం మహారాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించనుంది. ఈ మొత్తాన్ని ఆ రాష్ట్ర పోలీసు విభాగం ఖాతాకు జయచేయనుంది. ఈ ఏడాది జూలై 16న బాబ్లీ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు చంద్రబాబు నేతృత్వంలో 30 మంది ప్రజా ప్రతినిధులు మహారాష్ట్ర వెళ్లిన విషయం విదితమే. నిషేధిత ప్రాంతంలో అడుగుపెట్టారని పేర్కొంటూ వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసింది. వారిని 19న నాందేడ్ కోర్టులో హాజరుపర్చారు. అయితే, పోలీసుల వైఖరిని నిరసిస్తూ బెయిల్ తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో 26వ తేదీ వరకూ వారు పోలీసుల అధీనంలోనే ఉన్నారు.

ఈ సమయంలో వారి భోజన, వసతి కల్పనకు రూ.3.72 లక్షలను, వారిని హైదరాబాద్ పంపేందుకు విమాన చార్జీల రూపంలో రూ.16.30 లక్షల మొత్తాన్ని పోలీస్ విభాగం వెచ్చించాల్సి వచ్చింది. ఈ మొత్తాన్ని చెల్లిస్తామని అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించినా చెల్లింపులో ఆలస్యం అయింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆ మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X