Chandrababu Cycle: అదుపు తప్పిన చంద్రబాబు సైకిల్..! తృటిలో తప్పించుకుని..!

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ విశాఖలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు 20 నిమిషాల పాటు సైకిల్ కూడా తొక్కారు. ఈ మధ్య ఆర్దిక సంక్షోభం నేపథ్యంలో అందరూ సైకిల్ తొక్కాలని పిలుపునిస్తున్న ఆయన.. ఇవాళ తానే స్వయంగా సైకిల్ ఎక్కారు. చుట్టు భద్రతా సిబ్బంది వెంట రాగా.. ఆయన సైకిల్ తొక్కి అందరినీ ఉత్సాహపరిచారు. అయితే మధ్యలో చంద్రబాబు నడుపుతున్న సైకిల్ అదుపు తప్పింది.

జగన్ కోసమేనా డీకే శివకుమార్ కు సీఎం ? రాహుల్ బిగ్ స్కెచ్..!
జగన్ కోసమేనా డీకే శివకుమార్ కు సీఎం ? రాహుల్ బిగ్ స్కెచ్..!

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్ లో మొక్కను నాటిన తర్వాత యూనివర్శిటీ గ్రౌండ్ నుంచి బీచ్ రోడ్డులోని నోవోటెల్ హోటల్ వరకు సైకిల్ పై ప్రయాణించారు. ఐదున్నర కిలో మీటర్ల మేర సీఎం సైకిల్ పై వెళ్లారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ నోవాటెల్ చేరుకున్నారు. సైకిలింగ్ అనేది జీవన విధానంలో భాగమవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.అయితే నోవాటెల్ హోటల్ కు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న సైకిల్ అదుపు తప్పి పక్కకు వెళ్లిపోయింది. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి సైకిల్ ను పట్టుకున్నారు.

Chandrababu Naidu Nearly Falls Off Cycle in Vizag Quick-Acting Security Prevents Mishap
బెజవాడలో మళ్లీ కేశినేని బ్రదర్స్ వార్..! చంద్రబాబు కోర్టులోకి బంతి...!
బెజవాడలో మళ్లీ కేశినేని బ్రదర్స్ వార్..! చంద్రబాబు కోర్టులోకి బంతి...!

ఒక్కసారిగా సైకిల్ అదుపు తప్పడంతో చంద్రబాబు షాకయ్యారు. అయితే భద్రతా సిబ్బంది సహకారంతో తిరిగి సైకిల్ ను యథాస్దితికి తీసుకొచ్చి మళ్లీ తొక్కడం ప్రారంభించారు. అలా నోవాటెల్ హోటల్ కు చేరుకుని అక్కడ నిర్వహించిన సీ-ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్ షాప్ కు చంద్రబాబు హాజరయ్యారు. అక్కడ ప్రసంగంలో చంద్రబాబు తాను సైకిల్ పైనే వచ్చినట్లు వెల్లడించారు. సైకిలింగ్ ద్వారా ఆరోగ్యం బాగుంటుందని, ఖర్చులూ తగ్గుతాయని తెలిపారు. ప్రజలు కూడా సైక్లింగ్ ను తిరిగి అలవాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+