మెట్రోలో ప్రయాణం చేస్తున్నారా? ఇవి తీసుకెళ్తే జైలుకే .. రూల్స్ ఇవే!

నేటి రోజుల్లో మెట్రో రైలు ప్రయాణం నగరవాసుల జీవితాల్లో ఒక అంతర్భాగంగా మారింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ప్రముఖ నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి లక్షలాది మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగిస్తున్నారు. అయితే, మెట్రో ప్రాంగణంలో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ కొన్ని కఠినమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

మెట్రోలో ప్రయాణం చేస్తే నిబంధనలు పాటించాల్సిందే

ఈ నియమాలను ఉల్లంఘిస్తే కేవలం జరిమానాలతోనే సరిపెట్టకుండా, తీవ్రమైన చట్టపరమైన చర్యలు మరియు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మెట్రో నిబంధనల ప్రకారం, ప్రతి ప్రయాణికుడి వద్ద తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే టికెట్ లేదా స్మార్ట్ కార్డ్ ఉండాలి. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం, కోచ్‌లలో పెద్దగా అరవడం, గొడవలకు దిగడం వంటి పనులు పూర్తిగా నిషేధించబడ్డాయి.

Traveling by Metro trains Carrying these items could send you into jail here are the metro rules

మెట్రోలో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తికి జరిమానాతో పాటు కేసు

ఇటీవల నాగోల్-రాయదుర్గం మార్గంలో ప్రయాణిస్తున్న ఒక యువకుడు మెట్రో సీట్లో కూర్చుని, అక్కడి కిటికీ గ్లాస్ స్క్రీన్‌పై కాళ్లు పెట్టి కూర్చున్నాడు. ఈ ప్రవర్తనపై తీవ్రంగా స్పందించిన మెట్రో సిబ్బంది మరియు భద్రతా అధికారులు ఆ ప్రయాణికుడికి రూ. 250 జరిమానా విధించడమే కాకుండా, స్థానిక పోలీసుల ద్వారా కేసు కూడా నమోదు చేశారు.

మెట్రోలో ఈ వస్తువులు నిషేధం

మెట్రో రైళ్లలో లగేజీపై కూడా పరిమితులు ఉన్నాయి. 25 కేజీల లోపు బరువు ఉన్న సామాన్లను మాత్రమే మెట్రోలో తీసుకు వెళ్ళాలి. ఇక నిషేధిత వస్తువులైన పేలుడు పదార్థాలు, పెట్రోల్, కిరోసిన్, తుపాకులు, కత్తులు వంటి ప్రమాదకరమైన వస్తువులు తీసుకెళ్లడం నిషేధం. సిగిరెట్ తాగటం, మద్యం తాగటం మెట్రో స్టేషన్ పరిసరాలలో పరిశుభ్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత.

వాటర్ బిల్లు పేరుతో లింక్.. జాగ్రత్త అంటున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్!
వాటర్ బిల్లు పేరుతో లింక్.. జాగ్రత్త అంటున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్!

ఇలా చేస్తే భారీ జరిమానాలు, కేసులు

అక్కడ ఇష్టానుసారంగా ఉమ్మివేయడం, చెత్త వేయడం లేదా మెట్రో ఆస్తులను ధ్వంసం చేయడం వంటి పనులకు పాల్పడితే భారీగా జరిమానాలు విధిస్తారు. స్థానిక రాష్ట్ర ప్రభుత్వాల మెట్రో చట్టాల ప్రకారం ప్రయాణికుల రక్షణ కోసం ప్రత్యేక నిఘా విభాగాలు పనిచేస్తున్నాయి. స్టేషన్లలోని సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించి, మెట్రో సిబ్బందికి సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘించి అనవసరమైన చట్టపరమైన ఇబ్బందుల్లో పడవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+