లోకేష్ ఛానల్లో వైయస్ రాజశేఖరరెడ్డి, రాజాల అవినీతి కథ

ఇక కేంద్రంలో కూడా 2జి స్పెక్ట్రంలో మాజీమంత్రి రాజా భారీ కుంభకోణాలకు పాల్పడ్డారని కేంద్ర బడ్జెట్లోలా ఆయన కుంభకోణం వాటా 17 శాతం అంటూ చెప్పారు. సుమారు లక్షా 74వేల కోట్ల రూపాయల కుంభకోణానికి రాజా పాల్పడ్డారు. స్వతంత్ర భారతదేశంలో రాజా చేసిన భారీ కుంభకోణం మరొకటి లేదని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి గానీ, మాజీమంత్రి రాజాలకు గానీ ఇద్దరికీ అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపించారు.
కాగా వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై రాజా కరెప్షన్ యువరాజ్ పేరుతో కథనాన్ని ప్రసారం చేసింది. తండ్రి పదవిలో ఉన్న కాలంలో తనయుడికి భారీ డబ్బులు సమకూర్చి పెట్టాడని ఆరోపించింది. పేదోళ్ల దేవుడిగా కీర్తించబడుతున్న వైయస్ తనయుడికి రాష్ట్ర ప్రజల అక్రమంగా కట్టబెట్టారని విమర్శించారు. ఆ అవినీతి సంపాదనతో వైయస్ జగన్ ఇడుపులపాయ, బెంగుళూరు, హైదరాబాదు తదితర ప్రాంతాల్లో ప్యాలెస్ లను తనదన్నే భవంతులు కట్టారన్నారు. జగన్ తండ్రిని అడ్డు పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications