రైతు సమస్యలు తీర్చకుంటే ప్రభుత్వం సంగతి తేలుస్తాం: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: రైతుల సమస్యలు తీర్చకుంటే ప్రభుత్వ సంగతి తేలుస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ప్రభుత్వం విరుచుకు పడ్డారు. రైతుల అరెస్టుకు, ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా చంద్రబాబు అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వం రైతులను అరెస్టు చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఇది అసమర్థ ప్రభుత్వం కాబట్టి రైతుల సమస్యలు పట్టించుకోవటం లేదన్నారు. రైతులను అరెస్టు చేసిన ఈ రోజు చరిత్రలో ఓ బ్లాక్ డే గా మిగిలి పోతుందన్నారు. ప్రభుత్వానికి రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. ఇది చాలా బాధాకరమన్నారు. సమస్యలను ప్రభుత్వం జఠిలం చేస్తుందన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం విపక్షాలన్నీ కలిసి పోరాడుతామన్నారు. అరెస్టు చేసిన ఎమ్మెల్యేలను విడిచి పెట్టే వరకు ఇక్కడే ఉంటానన్నారు.

అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే లేదన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. కాగా అంతకుముందు రైతుల అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీ ముందు బైఠాయించారు. దీంతో అసెంబ్లీ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేషన్ కు తరలించారు.

అంతకుముందు తమ సమస్యలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి సమస్యలు చెప్పుకోవడానికి రైతులు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అయితే వారికి సిఎంను కలవటానికి అవకాశం దొరకలేదు. దీంతో వారు అక్కడే ధర్నాకు దిగారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని పబ్లిక్ గార్డెన్ లో నిర్బంధించారు. అయితే రైతులు తమను సిఎంను, చంద్రబాబునాయుడును కలుసుకునేందుకు అవకాశమివ్వాలని పబ్లిక్ గార్డెన్ దగ్గరే బైఠాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+