చంద్రబాబు నోరు జారాడా, మనసులో మాట వచ్చిందా: చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: తాను ఏది చేసినా అధికారం కోసమే చేస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నాడని, శాసనసభలో ఆ మాట అన్నాడని, నోరు జారాడా మనసులో మాట నోటి ద్వారా వచ్చిందా అనేది చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నానని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. చంద్రబాబు అధికారం కోసమే రైతు సమస్యలపై పోరాటం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం ఉదయం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు పోరాటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పాలన ముగిసిన తర్వాత చంద్రబాబు పాలన మొదలైనప్పటి నుంచి రైతుల కష్టాలు మొదలయ్యాయని, ఇప్పుడు ఆందోళన చేస్తున్న చంద్రబాబు తన పాలనలో రైతులకు ఏం చేశారో సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. తన పాలనలో చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని, రైతుల నడ్డి విరిచారని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఏం చేసినా, ఏం చెప్పినా అధికారం కోసమేనని, చంద్రబాబు చేతల్లో మాటల్లో చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ గానీ చంద్రబాబు గానీ రైతుల కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తే తన మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజల విశ్వాసం పొందగలితే వారే అధికారాన్ని ఇస్తారని, ప్రత్యేకంగా అధికారం కోసం ప్రయత్నాలు అక్కర లేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో ప్రయత్నాలు సాగించాలని, అప్పుడే ప్రజల విశ్వాసం పొందగలుగుతామని ఆయన చెప్పారు. ఆ రకంగా ప్రజల ఆశీస్సులు తాను పొందగలుతాననే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. వైయస్ జగన్ పార్టీ భవిష్యత్తుపై చెప్పగలిగే భవిష్యవాణిని కానని ఆయన అన్నారు. సామాజిక న్యాయానికి తాను కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని, తన వైఖరిలో మార్పు లేదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+