చంద్రబాబునాయుడుకు షాక్: తెరాసలోకి మాజీ ఎంపీ జితెందర్ రెడ్డి

Chandrababu Naidu
మహబూబ్ నగర్: తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు జితెందర్ రెడ్డి చంద్రబాబునాయుడికి గట్టి షాక్ ఇవ్వనున్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ లో గట్టి పట్టు ఉన్న నాయకుడు జితెందర్ రెడ్డి తెదేపాకు రాజీనామా చేస్తే జిల్లాలో తెలుగుదేశం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోని నేతలలో మొదటినుండి తెలంగాణకు అనుకూలంగా ఉన్న వ్యక్తి జితెందర్ కావడం గమనార్హం.

ఆదివారం జితెందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుతో సమావేశమయినట్టు తెలుస్తోంది. తెలంగాణపై చంద్రబాబునాయుడి వైఖరితో విభేదించిన కారణంగానే ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు కానీ, రేపుకానీ ఆయన నిరాహార దీక్ష చేస్తున్న చంద్రబాబు దగ్గరకు వెళ్లి రాజీనామా సమర్చించే అవకాశాలున్నాయి. 21న గానీ 22నగానీ ఆయన తెరాసలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జితెందర్ రెడ్డి గత సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా పోటీ చేశారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయన పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్త కారణంగా ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ కు ఆయన సీటును వదులు కోవాల్సి వచ్చింది. అయితే కేసిఆర్ పై పోటీ చేద్దామని నిర్ణయించుకున్నప్పటికీ చంద్రబాబు జితెందర్ రెడ్డికి నచ్చజెప్పారు. దాంతో ఆయన చేవెళ్లనుండి శాసనసభ్యుడిగా పోటీ చేశారు. జితెందర్ వెంట మాజీ శాసనసభ్యుడు గట్టు భీముడు, మరికొందరు జెడ్పీటీసీలు తెరాసలో చేరే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+